తెలంగాణ డిగ్రీ విద్యార్దులకు శుభవార్త తెలిపిన తెలంగాణ సర్కార్ - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, April 26, 2020

తెలంగాణ డిగ్రీ విద్యార్దులకు శుభవార్త తెలిపిన తెలంగాణ సర్కార్

శుభ తెలంగాణ (26,ఏప్రిల్ ,2020 - హైదరాబాద్) :  తెలంగాణ డిగ్రీ విద్యార్దులకు సర్కార్ శుభవార్త చెప్పింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్  లైన్ తో పాటు, ఇతర పరీక్షల నిర్వహణ అసాధ్యమని ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి అన్నారు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత సాధారణ పరిస్థితులు  ఏర్పడ్డ 4 వారాల అనంతరం ప్రవేశ పరీక్షలు ఉంటాయన్నారు. డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలతో సంబంధం ఉన్న ప్రవేశ పరీక్షలన్ని డిగ్రీ పరీక్షల తర్వాతే నిర్వహిస్తామన్నారు. అదే విధంగా డిగ్రీ  ఫస్టియర్,సెకండియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామని కానీ ఫలితాలతో సంబంధం లేకుండా ప్రమోట్ చేయాలని నిర్ణయించినట్టు పాపిరెడ్డి తెలిపారు. పరీక్ష ఫలితాలతో సంబంధం లేకుండా ఫస్టియర్ విద్యార్ధులు సెకండియర్ కు,  సెకండియర్ విద్యార్ధులు ఫైనల్ ఇయర్ కు వెళ్లవచ్చు. ఆ తర్వాత ఏడాదిలో విద్యార్థులు బ్యాక్ లాగ్స్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఈ నియమం ఫైనల్ ఇయర్ విద్యార్ధులకు వర్తించదు.