మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో సోడియం హైపోక్లోరైట్ ను స్ప్రే చేసిన మల్కాజిగిరి పార్లమెంటు ఇంచార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి. - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, April 06, 2020

మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో సోడియం హైపోక్లోరైట్ ను స్ప్రే చేసిన మల్కాజిగిరి పార్లమెంటు ఇంచార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి.

మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో పలు వార్డులో తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ వారి ఆధ్వర్యంలో కరోనా వైరస్ నివారణ కు ముందస్తు చర్యలో భాగంగా జవహర్ నగర్ మొత్తం ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైట్ ను టిఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంటు ఇంచార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి స్పై చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ
రాష్ట్ర ముఖయమంత్రిని స్ఫూర్తిగా తీసుకొని తాను తన కళాశాల మర్రి లక్ష్మణ్ రెడ్డి గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల సహకారంతో స్వయంగా ఆహారం మరియు త్రాగునీటి సౌకర్యాలను మేడ్చల్, కుత్బుల్లాపూర్, కంటోన్మెంట్, నియోజిక వర్గాల్లో కల్పిస్తున్నామని తెలిపారు.. అదేవిధంగా, తారా స్వచ్చంధ సంస్థ, మదర్ ఇండియా ఆశ్రమం, అలాగే
మేడ్చల్ లోని కృషి ఆశ్రమం లకు ఒక నెలకు సరిపడే విధంగా నిత్యావసర సరుకులు బియ్యం , పప్పు, కూరగాయలు, పండ్లను తన సొంత నిధులతో పంపిణీ చేయడం జరిగింది అని తెలిపారు.

Post Top Ad