పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ శుభాకాంక్షలు - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, April 27, 2020

పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ శుభాకాంక్షలు

శుభ తెలంగాణ (27,ఏప్రిల్ , 2020) - హైదరాబాద్ :  తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాన లక్ష్యమైన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంతో  పాటు, సాధించుకున్న తెలంగాణలో అన్ని రంగాల్లో గొప్ప విజయాలను టిఆర్ఎస్ పార్టీ సాధించిందని కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన ఆరేళ్లలో అనేక అద్భుతాలు సాధించిందని... సంక్షేమం,  విద్యుత్, మంచినీరు, సాగునీరు, వ్యవసాయం, పరిశ్రమలు తదితర రంగాల్లో గొప్ప  విజయాలు నమోదు చేసిందన్నారు. ప్రజలు దశాబ్దాల తరబడి ఎదుర్కొంటున్న అనేక సమస్యలను టీఆర్ఎస్ ప్రభుత్వం పరిష్కరించిందని కేసీఆర్ తెలిపారు. టీఆర్ఎస్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచేలా ఎన్నో పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. ఇది టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, రాష్ట్ర ప్రజలకు ఎంతో గర్వకారణం" అని ముఖ్యమంత్రి ప్రకటించారు. 'టీఆర్ఎస్ ఆవిర్భవించి రెండు దశాబ్దాలు గడిచిన సందర్భంగా గొప్పగా జరుపుకోవాల్సిన వేడుకులను కరోనా వైరస్ నేపథ్యంలో నిరాడంబరంగా జరుపుకోవాలని పార్టీ  నాయకత్వం నిర్ణయించింది. మరో సందర్భంలో పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుందామన్నారు.  ఈ సారికి మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఎవరికి వారు తమ ప్రాంతాల్లో అత్యంత నిరాడంబరంగా ఎక్కడికక్కడే పతాకావిష్కరణ చేయాలని కేసీఆర్ అదేశాలు ఇచ్చారు. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించాలన్నారు.