లాక్ డౌన్ తోనే కరోనా వైరస్ కు కిక్ డౌన్ - లాక్ డౌన్ అమలు తీరుతెన్నులపై క్షేత్రస్థాయిలో సైబరాబాద్ సీపీ పరిశీలన..... - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, April 09, 2020

లాక్ డౌన్ తోనే కరోనా వైరస్ కు కిక్ డౌన్ - లాక్ డౌన్ అమలు తీరుతెన్నులపై క్షేత్రస్థాయిలో సైబరాబాద్ సీపీ పరిశీలన.....

హైదరాబాద్: బాలానగర్ జోన్ లో అమలవుతున్న లాక్ డౌన్ తీరుతెన్నులను గురువారం సైబరాబాద్ పోలీస్ కమీషనర్  వీసీ సజ్జనార్  సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్ ఎమ్ విజయ్ కుమార్ తో పాటు పలు శాఖల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
 -జగద్గిరిగుట్ట, గాజులరామారం, జీడిమెట్ల, బాలానగర్, సనత్ నగర్, బోరబండ, ఎల్లమ్మబండ తదితర ప్రాంతాలను సజ్జనార్ పరిశీలించారు. వాహనదారులను ఆపి ఎందుకు బయటకు వచ్చారని వివరాలు ఆరా తీశారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప అనవసరంగా బయటకు వస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు లాక్ డౌన్ నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. కర్ఫ్యూ కాదు care for you అన్నారు.  లాక్ డౌన్ తోనే వైరస్ కిక్ డౌన్ అవుతుందని ప్రజలకు సూచించారు. ప్రజలు ప్రతీ ఒక్కరూ మాస్కులను ధరించాలన్నారు. తరచుగా చేతులను శుభ్రం చేసుకోవాలన్నారు. ఒక శానిటైజర్ ను దగ్గర ఉంచుకోవాలన్నారు. సామాజిక దూరాన్ని/ సోషల్ డిస్టెన్స్ ను పాటించాలన్నారు.అనంతరం సీపీ  జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ను సందర్శించి బాలానగర్ డివిజన్ లోని సనత్ నగర్ పోలీస్ స్టేషన్ హౌజ్  ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి, బాలనగర్ ఎస్ హెచ్ ఓ ఎస్హెచ్ఓ వహీయుద్దీన్,  జీడిమెట్ల ఎస్ హెచ్ ఓ బాలరాజ్, జగద్గిరిగుట్ట ఎస్ హెచ్ ఓ గంగారెడ్డి తదితరులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.ముందుగా సంబంధిత ఇన్ స్పెక్టర్లను అడిగి సిబ్బంది సాధకబాధలను తెలుసుకున్నారు. సమస్యలను ఎప్పటికప్పుడు తమ దృష్టికి తీసుకువస్తే తగు విధంగా పరిష్కరిస్తామన్నారు.సిబ్బంది ఆరోగ్య సమస్యలను వాకబు చేశారు. సిబ్బంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.లాక్ డౌన్ నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలన్నారు.
ఈ కార్యక్రమంలో బాలానగర్ డీసీపీ పద్మజా, బాలానగర్ ఏసీపీ పురుషోత్తం, సీఏఆర్  హెడ్ క్వార్టర్స్ సీఎస్డబ్ల్యూ అడిషనల్ డిసిపి మాణిక్ రాజ్, ఐటీ ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్, సనత్ నగర్ పోలీస్ స్టేషన్ హౌజ్  ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి, బాలనగర్ ఎస్ హెచ్ ఓ వహీయుద్దీన్,  జీడిమెట్ల ఎస్ హెచ్ ఓ బాలరాజ్, జగద్గిరిగుట్ట ఎస్ హెచ్ ఓ గంగారెడ్డి తదితరులు ఉన్నారు.

Post Top Ad