కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన హాట్ స్పాట్ రెడ్ జోన్ జిల్లాల్లో వరంగల్ అర్బన్ - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, April 16, 2020

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన హాట్ స్పాట్ రెడ్ జోన్ జిల్లాల్లో వరంగల్ అర్బన్

శుభ తెలంగాణ ( 16, ఏప్రిల్ , 2020) : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన హాట్ స్పాట్ రెడ్ జోన్ జిల్లాల్లో వరంగల్ అర్బన్ కూడా ఉంది. అధికారికంగా అర్బన్లో ప్రస్తుతం 21 కరోనా పాజిటివ్  కేసులున్నాయి. కొందరు ఇప్పటికే ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. వరంగల్ నగరంలో 15 ప్రాంతాల్లో సంచార నిషేధ ప్రాంతాలుగా ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో ఇంటింటి సర్వేతోపాటు, ఇక్కడి వారు బయటకు రాకుండా డోర్ డెలివరీ సేవలను  అందిస్తున్నారు. కొత్త కేసులు రాకుండా జిల్లా యంత్రాంగం జాగ్రత్తలు తీసుకుంటోంది. జనగామ,  జయశంకర్, ములుగు, మహబూబాబాద్ జిల్లాలు ఆరెంజ్ జోన్ కోవలోకి వస్తాయి. ఈ జిల్లాల్లో కరోనా వ్యాప్తి చెందిన ప్రాంతాల్లో గట్టి చర్యలు తీసుకుంటున్నారు. వరంగల్ రూరల్ జిల్లాలో ఒక్క కేసు లేకపోవడంతో ఇది గ్రీన్ జోన్ గా ఉంది. అర్బన్లో కేసులు రాకుండా 14 రోజుల పాటు ఉంటే ఇది అనంతరం నాన్ హాట్ స్పాట్ జోన్ గా మారనుంది. మిగతా నాలుగు జిల్లాల్లో  కొత్త కేసులు రాకుండా ఉంటే ఇవి గ్రీన్ జోన్లుగా మారతాయి. రెడ్  జోన్లో కేంద్ర ప్రభుత్వం జారీచేసిన నిబంధనలన్నీ పక్కాగా అమలయ్యే విధంగా చూస్తామని వరంగల్ పోలీసు కమిషనర్ విశ్వనాథ రవీందర్ తెలిపారు.