వరంగల్ లో పదేళ్ల చిన్నారికి కరోనా పాజిటివ్ - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, April 22, 2020

వరంగల్ లో పదేళ్ల చిన్నారికి కరోనా పాజిటివ్

శుభ తెలంగాణ (22 , ఏప్రిల్ , 2020 - హన్మకొండ ) :  మార్కజ్ ఘటన తర్వాత జిల్లాలో కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంతలోనే మంగళవారం అందిన నివేదికలో ఓ పదేళ్ల చిన్నారి కరోనా పాజిటివ్ గా తెలడం గమనార్హం. వివరాల్లోకి వెళ్తే హన్మకొండ వడ్డేపల్లి లోని పూరిగుట్ట ప్రాంతానికి  చెందిన ఓ వ్యక్తి సైన్యంలో పనిచేస్తున్న ఢిల్లీ లో ఉంటున్నాడు. నెల క్రితం అయిన తన భార్య, కుమారుడు, కుమార్తె తో కలిసి స్వస్థలానికి వచ్చాడు. ఆ తర్వాత ఓ కార్యక్రమంలో  పాల్గొనేందుకు హుజురాబాద్, సిద్దిపేట వెళ్లి వచ్చాడు. ఇంతలోనే నాలుగు రోజుల క్రితం కుటుంబ పెద్ద అస్వస్థతకు గురి కాగా, అనుమానించిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆయనతో పాటు భార్య,   పిల్లలను వరంగల్ ఆయుర్వేద ఆసుపత్రి క్వారం టైన్ కు తరలించారు. వీరి నమూనాలను స్వీకరించి హైదరాబాద్ కు పంపగా మంగళవారం సాయంత్రం  నివేదికలు అందాయి. ఇందులో సదరు వ్యక్తి కుమార్తె కు పాజిటివ్ వచ్చిందని డిఎహెచ్ఓ లలితాదేవి దృవీకరించారు. అయితే ఆమె తల్లిదండ్రులు సోదరుడికి మాత్రం నెగిటివ్ వచ్చిందని తెలిపారు.