మద్యం వ్యాపారులతో కుమ్మక్కైన ఎస్సె ని సస్పెండ్ చేసిన సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, April 27, 2020

మద్యం వ్యాపారులతో కుమ్మక్కైన ఎస్సె ని సస్పెండ్ చేసిన సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌


శుభ తెలంగాణ (27,ఏప్రిల్ , 2020) - హైదరాబాద్ : కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ లో ప్రజలను రక్షించేందుకు విధులు నిర్వహించాల్సిన పోలీసు అవినీతి వ్యాపారులతో కలిసి ప్రభుత్వ రూల్స్ కి వ్యతిరేకంగా వ్యవహరించిన ఘటన ఈమద్యే వెలుగులోకి వచ్చింది .  మద్యం వ్యాపారులతో కుమ్మకైన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ శ్రీధర్‌ను సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ సస్పెండ్‌ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. పోలీస్‌ ఉన్నతాధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్‌ మండ లం పాల్మాకులలో ఉన్న వైన్స్‌లో మార్చి 31న వైన్‌ షాపు యాజమానులు అర్ధరాత్రి దుకాణాన్ని తెరిచి మద్యాన్ని అక్రమంగా వాహనంలో తరలిస్తూ పోలీసులకు దొరికిపోయారు. ఎస్‌ఐ శ్రీధర్‌ ఆ కేసును పక్కదోవ పట్టించి లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన మద్యం వ్యాపారులకు అనుకూలంగా కేసును మార్చాడు. దీంతో పోలీస్‌ ఉన్నతాధికారులకు విషయం తెలియడంతో శాఖాపరమైన విచారణ జరిపించారు. ఈ విచారణలో ఎస్‌ఐ శ్రీధర్‌ అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో అతడిని శనివారం సస్పెండ్‌ చేశారు.