జూబ్లీహిల్స్ ప్రజలకు రేషన్ బియ్యం అందించిన ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, April 04, 2020

జూబ్లీహిల్స్ ప్రజలకు రేషన్ బియ్యం అందించిన ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్

జూబ్లీహిల్స్ నియోజక వర్గంలో శనివారం 1200 నిరుపేద కుటుంబాలకు గాయత్రి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ రేషన్ బియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోన వ్యాధి వ్యాప్తి కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో
నియోజక వర్గంలో ప్రతి నిరుపేదకు అండగా ఉచిత బియ్యం పంపిణీ చేస్తామన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశం, రాష్ట్రం ఇబ్బందులలో ఉన్నప్పుడు
ఆదుకోవడానికి ఇలాంటి ట్రస్ట్ లు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గాయత్రి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నియోజక వర్గంలోని యూసఫ్ గూడ, రహమత్ నగర్, ఎర్ర గడ్డ, బోరాబండా, శ్రీనగర్ కాలనీ, షేక్ పేట ప్రాంతాల ప్రజలకు బియ్యం పంపిణీ కి ముందుకు వచ్చిన దాతలు శ్రీనివాస్ రెడ్డి, విజయ్ గాంధీ లింగం, భారత్ లింగం, మరవ్ లింగం, లోకేష్ లింగం వీరిని అందరిని ఎమ్మెల్యే గోపీచంద్ అభినందినందించారు.

Post Top Ad