మద్యం కోసం దొంగతనానికి పాల్పడ్డ యువకుడు - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, April 04, 2020

మద్యం కోసం దొంగతనానికి పాల్పడ్డ యువకుడు

ప్రతిరోజు మద్యం చుక్క పడందే రోజు ప్రారంభించని వారికి, నిద్ర పట్టని వారికి లాక్ డౌన్ శాపంగా మారింది. ఎక్కడా మందు దొరక్కపోవడంతో మద్యం ప్రియులు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. కొందరు మద్యం షాపుల్లో దూరి దొంగతనాలు కూడా చేస్తున్నారు.

తాజాగా ఇలాంటి ఘటన హైదరాబాద్ లో కూడా
చోటుచేసుకుంది. హైదరాబాద్ గాంధీ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని బోయిగూడా లో ఉన్న శ్రీ వెంకటేశ్వర వైన్స్ షాప్ లో మద్యం లూటీ చేశారు దొంగలు. షాప్ పైన ఉన్న ఐరెన్ రేకులు తొలగించి సుమారు 70వేల మద్యం బాటిల్స్ తో పాటు
15వేల వరకు దోంగలించారని షాప్ యజమాని శివ కుమార్ గౌడ్ తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న గాంధీనగర్ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Post Top Ad