రోడ్డు పై ఉమ్మినందుకు కేసు బుక్... - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, April 11, 2020

రోడ్డు పై ఉమ్మినందుకు కేసు బుక్...

కరోనా మహమ్మారి కోరలు చాస్తున్న సమయంలో ప్రభుత్వం లాక్ డౌన్ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగానే బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం నేరమని, అలా ఉమ్మేసిన వారిపై కేసు కూడా నమోదు చేస్తామని ప్రభుత్వం
ప్రకటించింది.తాజాగా సరూర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని చంపాపేట చౌరస్తా దగ్గర రోడ్డు పై ఉమ్మినందుకు అబ్దుల్ ముజేద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అంతేకాక
అతనిపై సెక్షన్ 274, 269 ఐపీసీ కింద కేసు కూడా నమోదు చేశారు. ఇకమీదట ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడం వంటివి చేస్తే శిక్షలు మరింత కఠినంగా ఉంటాయని పోలీసులు తెలిపారు.

Post Top Ad