కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను కొవిడ్ కట్టడి చర్యలకు వినియోగించాలి: ఎంపీ బండి సంజయ్ - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, April 21, 2020

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను కొవిడ్ కట్టడి చర్యలకు వినియోగించాలి: ఎంపీ బండి సంజయ్

శుభ తెలంగాణ (21, ఏప్రిల్ , 2020 - వరంగల్ ) : కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు ఇవ్వాల్సిన ఏప్రిల్ నెల వాటాగా, అన్ని రాష్ట్రాలకు కలిపి కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ విడుదల చేయడం పట్ల కరీంనగర్ ఎంపీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి విడుదల చేసిన నిధులను కొవిడ్ కట్టడి చర్యలకు వినియోగించాల్సిందిగా ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు ఇవ్వాల్సిన ఏప్రిల్ నెల వాటాగా ఆర్థికశాఖ విడుదల చేసిన రూ.982 కోట్ల నిధులను కరోనా కట్టడికి వినియోగించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కోరారు. వైరస్ వ్యాప్తి నివారణలో కీలక పాత్ర పోషిస్తున్న వైద్య, పారిశుద్ధ్య సిబ్బంది, పంచాయతీ, మున్సిపల్  సిబ్బంది, పోలీసులకు కావల్సిన వ్యక్తిగత రక్షణ కిట్లను సమకూర్చడం... కరోనా నిర్ధరణ కిట్ల కొనుగోలుకు నిధులను వినియోగించుకోవాలని పేర్కొన్నారు. రబీలో పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేసి, సత్వరమే డబ్బులు చెల్లించాలని... అకాల వర్షాలకు, వడగండ్ల వానలకు దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించడానికి ఈ నిధులను కేటాయించాలని బండి సంజయ్ ప్రభుత్వాన్ని కోరారు.