కరీంనగర్ జిల్లాలో కరోనా బాధితులు ఒక్కొక్కరుగా
కోలుకుంటున్నారు. జిల్లాకు చెందిన 19 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, ఇప్పటికే 17 మంది విడతలవారీగా డిశ్చార్జ్ అయ్యారు. మిగిలిన ఇద్దరిలో ఒకరు సోమవారం ఇంటికి రాగా, ఇక ఒక్కరే మిగిలారు. ఏప్రిల్ 2 నుంచి హైదరాబాద్ లోని కింగ్ కోటిలో చికిత్స పొందుతున్న జిల్లాకు చెందిన వ్యక్తి 24 రోజుల తర్వాత కోలుకుని సోమవారం
డిశ్చార్జ్ అయినట్లు డీఎంహెచ్ వో జీ సుజాత తెలిపారు. మర్కజ్ కు వెళ్లి వచ్చిన ఇతడికి చికిత్స తర్వాత కరోనా నెగెటివ్ వచ్చినప్పటికీ హోం క్వారంబైలో ఉంచుతామని, ప్రతి రోజూ వైద్య సిబ్బంది ఇతడి ఆరోగ్యాన్ని పరీక్షిస్తారని ఆమె తెలిపారు. కాగా, కరోనా సోకిన ఇంకా ఒక్కరు మాత్రమే హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నారని వివరించారు.