మేము సైతం అంటున్న విద్యార్థులు.. తమ వంతుగా నిరుపేదలకు,వలస కూలీల కు కూరగాయలు పంపిణీ... - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, April 27, 2020

మేము సైతం అంటున్న విద్యార్థులు.. తమ వంతుగా నిరుపేదలకు,వలస కూలీల కు కూరగాయలు పంపిణీ...

శుభ తెలంగాణ(27ఏప్రిల్ 20)మేడ్చల్ జిల్లా లోని ఉప్పల్ నియోజకవర్గం లో పలు ప్రాంతాల్లో మేము సైతం టీమ్, గాంధీనగర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు జీ. సత్యనారాయణ ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు మనోజ్ & టీమ్ ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చిన కూలీలకు, నిరుపేదలకు ఇంటింటికీ  తిరిగి వారం రోజులకు సరిపడా కూరగాయలు ఉచితంగా వారికీ అందజేశారు.
ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మనోజ్ మాట్లాడుతూ.... లాక్ డౌన్  కారణంగా వలస కూలీలను,నిరుపేదలను ఆదుకునే అవసరం ఎంతైనా మన అందరి పై ఉందని.ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా పేద వారికీ  సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. 
అనంతరం మేము సైతం టీమ్,గాంధీనగర్ యూత్      అసోసియేషన్ అధ్యక్షుల జీ.సత్యనారాయణ మాట్లాడుతూ.... విద్యార్థి నాయకులు మనోజ్ &టీమ్  లాక్ డౌన్ మొదలైనప్పటి నుండి ప్రతిరోజు వర్టెక్స్ కాంప్లెక్స్ దగ్గర అన్నదానం చేస్తున్నారని. అయితే ఈరోజు వలస కూలీలును,నిరుపేదలను గుర్తించి వారి వద్దకు వెళ్లి కూరగాయలు పంపిణీ చేయడం చాలా సంతోషకరమైన విషయమని వారి సేవకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు పవన్, షఫీ నరేష్ రాజు హరీష్, మరియు మేము సైతం టీమ్ సభ్యులు  కనకరాజు,అశోక్,రాకేష్,కృష్ణ,హరిబాబు,జి బాలకృష్ణ, యేసు, భాజీవల్లి తదితరులు పాల్గొన్నారు...

మరిన్ని చిత్రాలు :