ప్రమాదవశాత్తు నీటిగుంతలో మునిగి గొర్లకాపరి మృతి - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, April 22, 2020

ప్రమాదవశాత్తు నీటిగుంతలో మునిగి గొర్లకాపరి మృతి

శుభ తెలంగాణ (22,ఏప్రిల్,2020-పెద్దపల్లి) :  ప్రమాదవశాత్తు నీటిగుంతలో మునిగి గొర్లకాపరి  మృతిచెందిన ఘటన బుధవారం పెద్దపల్లి జిల్లా  గుంజపడుగులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కామారెడ్డి జిల్లా సంగమేశ్వర్ కు చెందిన మొగిల్ల నరేశ్ వృత్తిరీత్యా గొర్రెల కాపరి పెద్దపల్లి జిల్లా గుంజపడుగు వద్ద పార్వతి బ్యారేజ్ కింద గల నీటి గుంతలో స్నానం చేయడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి దుర్మరణం పాలయ్యాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి శవపరీక్షకు మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని  పోలీసులు వెల్లడించారు.