లాక్ డౌన్ వల్ల ఉపాధి లేక పోవడంతో ఇబ్బందులు
పడుతున్న నిరుపేద కూలీలకు కరీంనగర్ రూరల్
పోలీసులు చేయూతనందించారు. బుధవారం బొమ్మకల్ గ్రామ శివారులో కూలీ పని చేసుకుని కుటుంబాలను పోషించుకునే పేదలకు పని లేక పోవడంతో పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో స్పందించిన రూరల్ ఏసీపీ విజయసారధి, సీఐ శ్రీనివాసరావులు దాతల సహకారంతో 27 కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకకులు,
కూరగాయలు అందించారు. అలాగే గుంటూరుపల్లి శివారులో 20 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించారు. ఈ కార్యక్రమంలో దాతలు హన్మంతరావు, సిబ్బంది సత్తయ్య, రవి, లింగారెడ్డి, పరశురాం తదితరులు పాల్గొన్నారు