తుర్కపల్లి గ్రామం లో ఆకస్మిక తనిఖీ: కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, April 15, 2020

తుర్కపల్లి గ్రామం లో ఆకస్మిక తనిఖీ: కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు

శుభ తెలంగాణ (15, ఏప్రిల్ , 2020 , హైదరాబాద్ )  :  శామీర్ పెట్ మండలంలోని తుర్కపల్లి గ్రామాన్ని కాంటైన్మెంట్ గా గుర్తించిన్నందున మంగళవారం జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు గ్రామాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... తుర్కపల్లి గ్రామంలో కరోనా పాజిటివ్ కేసులు వచ్చినందున గ్రామ ప్రజలు ఇంటి నుంచి బయటకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

కరోనా పాజిటివ్ కేసు వచ్చిన ఇంటి పరిసరాలకు వెళ్లే మార్గాన్ని మూసి వేయాలని, ప్రజలు అటు వైపు కు వెళ్లకుండా బ్యానర్లు అంటించి అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి రోజు గ్రామంలో పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని, హైడ్రోక్లోరైడ్, బ్లీచింగ్ పౌడర్ చెల్లించాలని అన్నారు. ఈ పర్యటనలో అడిషనల్ కలెక్టర్ విద్యాసాగర్, ఆర్.డి.ఓ రవి, డియం అండ్ హెచ్ ఓ వీరంజనేయులు, శమిర్ పెట్ తహసిల్దార్ గోవర్ధన్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Post Top Ad