కొత్తమనోహర్ రెడ్డి ట్రస్ట్ ద్వారా నిరుపేద కుటుంబాలకు నిత్యవసరాలు పంపిణీ - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, April 19, 2020

కొత్తమనోహర్ రెడ్డి ట్రస్ట్ ద్వారా నిరుపేద కుటుంబాలకు నిత్యవసరాలు పంపిణీ


శుభ తెలంగాణ (19, ఏప్రిల్ , 2020) : లాక్ డౌన్ సందర్భంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజవర్గం పరిధిలో నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు టీఆర్ఎస్ సీనియర్ నేత కొత్త మనోహర్ రెడ్డి ముందుకొచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా 'కొత్త మనోహర్ రెడ్డి ట్రస్ట్' ద్వారా సుమారు పలు నిరుపేద కుటుంబాలకు నిత్యవసరాలు పంపిణీ చేయనున్నారు. సరూర్ నగర్ లోని ఎఎస్ఆర్ గార్డెన్ లో సరూర్ నగర్, ఆర్కే పురం డివిజన్ ప్రజలకు నిత్యవసరాలు అందించే ఏర్పాట్లు చేస్తున్నట్టు మనోహర్ రెడ్డి తెలిపారు.

ఈ రెండు డివిజన్లలో సుమారు 10,000 కుటుంబాలకు పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. నిత్యావసర వస్తువుల కిట్లు సిద్ధంగా ఉన్నాయని.. వాటికి సంబంధించిన అన్ని పనులు పూర్తి చేశామని ఆయన పేర్కొన్నారు. కరోనాను తరిమేందుకు అందరూ కృషి చేయాలని నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చిక్కుళ్ళ శివ ప్రసాద్ పాల్గొన్నారు.