ట్రాన్స్ జెండర్లకు సహాయం అందజేసిన కూకట్ పల్లి సీనియర్ టీఆర్ఎస్ నాయకుడు సత్యం గౌడ్ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, April 25, 2020

ట్రాన్స్ జెండర్లకు సహాయం అందజేసిన కూకట్ పల్లి సీనియర్ టీఆర్ఎస్ నాయకుడు సత్యం గౌడ్

శుభ తెలంగాణ (25,ఏప్రిల్ , 2020) - కే పీ హెచ్ బీ :  కరోనా ప్రభావం మధ్య తరగతి దిగువ, మధ్య తరగతి ప్రజలతోపాటు పేదల పైన కార్మికుల పైన తీవ్రంగా పడింది. వీరితో పాటు ట్రాన్స్ జెండర్ ల మీదా తీవ్రంగా పడింది. దీంతో వీరు తమ రోజువారీ ఆహార పదార్థాలు కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. దాతల సహాయం కోసం పరితపిస్తున్నారు. వలస కార్మికులకు, పేదలకు ప్రభుత్వం, దాతలు ఎవరో ఒకరు చేతనైనంత సహాయం చేస్తున్నారు. కూకట్ పల్లి, కేపీహెచ్ బీ హైదర్ నగర్ లో నివాసముంటున్న ట్రాన్స్ జెండర్ ల పరిస్థితిని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో మందికి ఇబ్బందులు ఉన్నాయి అని తెలిసికొని వాళ్ళకి సహాయం చేశారు హైదరాబాద్ కూకట్ పల్లిలో ఉన్న సీనియర్ టీఆర్ఎస్ నాయకుడు సత్యం గౌడ్ వీరి పై కరుణ చూపించారు. వారు అడగడమే తరువాయి బియ్యాన్ని శుక్రవారం వారికి అందజేశారు. దీంతో వారు సత్యం గౌడ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.