ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ... - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, April 14, 2020

ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ...

శుభ తెలంగాణ(14,ఏప్రిల్,2020)  : దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తుంది .  లాక్ డౌన్ నేపథ్యంలో ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల కార్యక్రమాల గురించి ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి జీహెచ్ఎంసీ, ప్రాజెక్ట్,వాటర్ వర్క్స్ మరియు ఎలక్ట్రిక్, మాస్టర్ ప్లాన్స్  అధికారులచే సమీక్ష సమావేశం  నిర్వహించారు. ఈ  సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత లాక్  డౌన్ నేపథ్యంలో రోడ్డు మీద ట్రాఫిక్ చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు, రోడ్డు విస్తరణ పనులు, నూతన రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.

రోడ్డు విస్తరణలో భాగంగా ప్రస్తుతం నాగోల్ నుండి  ఎల్బీనగర్ వరకు రోడ్డుకు అడ్డంగా ఉన్న దాదాపు 60  కట్టడాలను గుర్తించి దాదాపు 40 కట్టడాలను పాక్షికంగా తొలగించారు. మిగితా కట్టడాలు రెండు, మూడు రోజుల్లో తొలగించడం జరుగుతుందని అన్నారు. దానిలో భాగంగా కొన్ని పెద్ద,పెద్ద స్తంభాలు మరియు వాటర్ ఛాంబర్స్ రోడ్డు మీద అలాగే ఉండడంతో వాటిని యుద్ధప్రాతిపదికన పక్కకు  జరపాలని సూచించారు. పలుమార్లు అన్ని శాఖలకు  చెందిన అధికారులచే ప్రతి రోజు సమావేశాలు ఏర్పాటు చేసి ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని సరికొత్తగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని అన్నారు.

Post Top Ad