మోమిన్ పేట మండల కేంద్రము మొక్కజొన్న శనిగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, April 07, 2020

మోమిన్ పేట మండల కేంద్రము మొక్కజొన్న శనిగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్

శుభతెలంగాణ న్యూస్ : రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా ఐకెపి కేంద్రాల ద్వారా మొక్కజొన్న శనిగలు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతు పండించిన ధాన్యానికి మద్దతు ధర లభించాలని ఉద్దేశంతో ఈ కేంద్రాలను ఏర్పాటు చేసింది జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ పేర్కొన్నారు సోమవారం మండల కేంద్రంలోని మోమిన్ పేట మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించక అనేక అవస్థలు పడుతున్న తరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పండించే ప్రతి దాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతుకు మద్దతు ధర కల్పించాలని ఈ నిర్ణయం తీసుకున్నారని ఈ నిర్ణయం ద్వారా ప్రతి రైతు తాము పండించిన పంటలను దళారుల పాలు చేయకుండా నేరుగా కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి అమ్ముకోవాలి అన్నారు.
ఈ కొనుగోలు కేంద్రం ద్వారా కొన్న ధాన్యాన్ని ప్రభుత్వము  నేరుగా లబ్ధిదారుల దగ్గర అమ్మ కాలు జరుగుతుందని ఆయన అన్నారు ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా దళారీ వ్యవస్థను అరికట్టడం కోసం ప్రభుత్వం కఠినమైన నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు ఈ నిర్ణయం ద్వారా రైతులకు ఎంతో మేలు కలుగుతుందని ఆయన తెలిపారు మండలంలో మొక్కజొన్న వేరుశనగ శనిగలు అధికంగా పడుతున్నందున రైతుల మేలు కోసమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు ఈ కొనుగోలు కేంద్రంలో తీసుకున్న సరుకులకు వారం రోజుల్లో రైతు అకౌంట్లోకి నేరుగా డబ్బులు చెల్లించడం జరుగుతుందన్నారు ఈ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ వసంత వెంకట్ గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి పిఎసిఎస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి ఆయా గ్రామాల ఎంపిటిసిలు సర్పంచులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

Post Top Ad