మేము సైతం" అంటూ గాంధీనగర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు జి.సత్యనారాయణ ఉచితంగా నిత్యావసర సరుకులు బియ్యం కూరగాయలు పంపిణీ... - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, April 20, 2020

మేము సైతం" అంటూ గాంధీనగర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు జి.సత్యనారాయణ ఉచితంగా నిత్యావసర సరుకులు బియ్యం కూరగాయలు పంపిణీ...

శుభతెలంగాణ న్యూస్: మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి పరిధిలోని మౌలాలి గాయత్రి నగర్, ఫ్లోరా హోటల్ సమీపంలో రాష్ట్రంలోని ఇతర  జిల్లాల నుండి వలస వచ్చిన దినసరి కూలీలు కరోనా వైరస్ లాక్ డౌన్  నేపథ్యంలో ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని. అయితే ఒక మిత్రుడి ద్వారా తెలుసుకొని. "మేము సైతం" అంటూ గాంధీనగర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు జి.సత్యనారాయణ ఆదివారం 30 కుటుంబాలకు నిత్యవసర సరుకులు కూరగాయలు 75 కేజీల బియ్యం,చిన్నారులకు బిస్కెట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా గాంధీనగర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు, మేము సైతం కార్యనిర్వాహకులు జి.సత్యనారాయణ మాట్లాడుతూ...
ఈ వలస కూలీలు చాలా రోజుల నుండి తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్నారు.ఒక మిత్రుడి నుండి సమాచారాన్ని తెలుసుకోనీ వారికి సహాయం చేయడం జరిగింది అని అన్నారు. ఇలాంటి కష్టతర సమయంలో నీరుపేద ప్రజలను ఆదుకునే బాధ్యత ఎంతైనా మనందరిపై ఉందని.మాకు తోచిన విధంగా మేము సహాయం చేసిన అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి దాతలుగా సహకరించిన మిత్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సోహన్లాల్. సిర్వీ, రాజు కౌదరి, శ్రీహరి, మనిరెడ్డి,గడ్డం.సుధాకర్, పి.సుధాకర్ పాల్గొన్నారు....

మరిన్ని చిత్రాలు :