భారీ స్థాయిలో వీధులలో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణం స్ప్రే చేయిస్తున్న యంత్రంగం - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, April 13, 2020

భారీ స్థాయిలో వీధులలో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణం స్ప్రే చేయిస్తున్న యంత్రంగం

శుభ తెలంగాణ  (13, ఏప్రిల్,2020) :  ఫిర్జాదిగూడ మున్సిపాలిటీలోని 11వ డివిజన్ పరిధిలో బుద్ధనగర్, మల్లికార్జున నగర్ లలో ఈ రోజు స్పే చేశారు. స్థానిక కార్పొరేటర్ మద్ది యుగంధర్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బందిచే బ్యాక్టీరియాను రూపుమాపడానికి సోడియం హైపో క్లోరైడ్ ద్రావణం స్ప్రే చేయించారు. రోజు స్ప్రే చేయడం వల్ల కరోనా వైరస్ ను వ్యాప్తి చెందకుండా  నివారించవచ్చని కార్పొరేటర్ యుగంధర్ అన్నారు.అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తగూడెం చెక్ పోస్ట్ వద్ద రోడ్డుపై నిర్లక్ష్యంగా ఉమ్మి వేసిన ఇద్దరు వ్యక్తులపై అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. అబ్దుల్లాపూర్ మెట్ సీఐ దేవేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ రోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండల మల్కాపురం వెళ్లి వస్తున్నారు. కొత్తగూడెం చెక్ పోస్ట్ వద్ద వీరి బైక్ ను అపి తనిఖీ చేయగా నిర్లక్ష్యంగా రోడ్డుపైనే ఉమ్మి వేశారు. దీంతో హాజీ పాషా, మీర్ జహంగీర్ లపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Post Top Ad