సోడియం హైపో క్లోరైడ్ స్ప్రే విధానాన్ని పర్యవేక్షించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, April 14, 2020

సోడియం హైపో క్లోరైడ్ స్ప్రే విధానాన్ని పర్యవేక్షించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 131 కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని మాణిక్య నగర్ లో మహమ్మారి 'కరోనా వైరస్ కట్టడికి 'సోడియం హైపో క్లోరైడ్' రసాయాన్ని స్ప్రే చేస్తున్నారు. ఈ స్ప్రే విధానాన్ని  ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పర్యవేక్షించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పరిశుభ్రత పాటిస్తూ, ప్రజలందరూ ఇంట్లోనే ఉండాలని, ఎవ్వరూ భయాందోళనకు గురవ్వల్సిన అవసరం లేదన్నారు. కరోనాతో పోరాడేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికే కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందన్నారు. ఈ కార్యక్రమంలో కాలని అధ్యక్షుడు నాగార్జున గౌడ్, జనరల్ సెక్రెటరీ కిరణ్, వైస్ ప్రెసిడెంట్ పవన్, కమిటీ చైర్మన్ కలీల్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్, సతీష్, రాజేష్, కె.రఘు నాథ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Post Top Ad