శుక్రవారం ఉదయం మోదీ వీడియో సందేశం - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, April 02, 2020

శుక్రవారం ఉదయం మోదీ వీడియో సందేశం

ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు వీడియో సందేశం ఇవ్వనున్నారు. కరోనా ప్రభావంతో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించాక మన్ కీ బాత్ ద్వారా ఆయన మాట్లాడారు. ఇప్పుడు వీడియో రూపంలో సందేశం ఇవ్వనుండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. లాక్ డౌన్ గురించి ప్రధాని మళ్లీ ఏమైనా కీలక ప్రకటన చేయనున్నారా అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. 'రేపు ఉదయం 9 గంటలకు నేను ఓ చిన్న వీడియో సందేశాన్ని నా సహదేశవాసులతో పంచుకుంటా.' అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ప్రధాని వీడియో సందేశం కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Post Top Ad