శుభ తెలంగాణ (28, ఏప్రిల్ , 2020) : వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి కొవిడ్ వార్డులో పనిచేస్తున్న పారిశుద్ధ్య, సెక్యూరిటీ, పేషంట్ కేర్ కార్మికులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ కేవీ అనుబంధ తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో యూనియన్ అధ్యక్షుడు గడల రమేష్ మాట్లాడుతూ... మున్సిపల్పా రిశుద్ధ్య కార్మికులకు ఇస్తున్న రూ.5 వేల బోనస్ ను తమకూ వర్తింపజేయాలని కోరారు. జీవో 14 ప్రకారం 18 వేల వేతనం ఇవ్వాలని, ఔట్ సోర్సింగ్ లో చేస్తున్న వారిని క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తము సమస్యలపట్ల స్పందించాలని కోరారు. అనంతరం ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు.
Post Top Ad
Tuesday, April 28, 2020
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి కొవిడ్ వార్డులో సిబ్బంది ధర్నా
Admin Details
Subha Telangana News