ఆర్య వైశ్య సంఘం పేద ప్రజల కోసం తమ వంతు సహాయం - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, April 10, 2020

ఆర్య వైశ్య సంఘం పేద ప్రజల కోసం తమ వంతు సహాయం

లాక్ డౌన్ నేపథ్యంలో నాచారం ఆర్య వైశ్య సంఘం వారు పేద ప్రజల కోసం తన వంతు సహాయం అందజేశారు. కార్మికులు పస్తులు ఉండే పరిస్థితి ఎవరికి రాకూడదని, దినసరి కూలీలకు స్థానిక కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ ఆధ్వర్యంలో ఉపాధి కోల్పోయిన కూలీలకు బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శాంతి సాయి
జెన్ శేఖర్ మాట్లాడుతూ.. ఆర్యవైశ్యులు చేస్తున్న సేవ అభినందనీయమని అన్నారు.

ప్రభుత్వం పేద ప్రజలకు సహకారం అందిస్తుందని, ప్రభుత్వానికి అండగా పలు స్వచ్చంద సంస్థలు సహకారం అందిస్తున్నారని తెలిపారు. గత నాలుగు రోజులుగా 120 క్వింటాలు బియ్యం పంపిణి చేయడంపై ఆర్యవైశ్య సంఘాన్ని కార్పొరేటర్ శాంతి,
స్థానిక టీఆర్ఎస్ నేతలు, నాచారం పోలీస్ స్టేషన్ సీఐ మహేష్ లు అభినందించారు. ఆర్థికంగా బలపడిన పారిశ్రామికవేత్తలు ఇలాంటి విపత్కర పరిస్థితులలో పేద ప్రజలకు సహాయం చేసేందుకు ముందుకు రావాలని పలువురు కోరుతున్నారు.

Post Top Ad