అనాధ పిల్లలకు ఎమ్మార్వో ఆఫీస్ అధికారుల ఆధ్వర్యంలో అన్నదానం - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, April 17, 2020

అనాధ పిల్లలకు ఎమ్మార్వో ఆఫీస్ అధికారుల ఆధ్వర్యంలో అన్నదానం

శుభ తెలంగాణ (17, ఏప్రిల్ , 2020) :  అబ్దుల్లాపూర్ మేట్ లోని గుడ్ షెఫర్డ్ అనాధ ఆశ్రమం లో లాక్ డౌన్ నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న చిన్నారులకు అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో ఆఫీస్ అధికారులు ఆర్.ఐ మహేష్ మరియు వి.ఆర్.ఓ ఆనంద్ ఆధ్వర్యంలో 100 మంది చిన్నారులకు అన్నదానం చేసి ఆశ్రమానికి కావాల్సిన సరుకులు పంపిణీ చేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఎవరూ  కూడా పస్థులు ఉండకూడదు అనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం చేపట్టామని అధికారులు తెలిపారు. అనాధ పిల్లలను దాతలు ఉంటే లాక్ డౌన్ నేపథ్యంలో ఆదుకోవాలి అనీ పిలుపునిచ్చారు.