కరోనా కట్టడి దృష్ట్యా ప్రభుత్వ వైఖరి ని తీవ్రంగా నిరసించిన కాంగ్రెస్ నాయకులూ - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, April 13, 2020

కరోనా కట్టడి దృష్ట్యా ప్రభుత్వ వైఖరి ని తీవ్రంగా నిరసించిన కాంగ్రెస్ నాయకులూశుభ తెలంగాణ  (13, ఏప్రిల్,2020 - హైదరాబాద్ )  : తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవలే ఆర్భాటంగా లాక్ డౌన్ ని ఈ  నెల 30 పొడిగించి చేతులు దులుపుకున్నారని , ప్రజలకు కనీస అవసరాలు కూడా తీర్చకున్న ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని వెల్లడించారు .  గ్రామీణ ప్రాంతంలోని ప్రజలు సరకుల కొరత తో నిత్యం బాధపడుతున్నారని , వారు సరకుల కోసం పట్టణానికి వెళ్లాలని , రవాణాకు సరైన సదుపాయాలు లేక , గతిలేక గ్రామాలలోని రెట్టింపు ధరలతో సరకులు కొంటున్నారని తెలిపారు , ఎదో ఉచితంగా బియ్యం ఇచ్చి చేతులు దులుపుకుని వైఖరి సరి  కాదని అన్నారు, ఇస్తా అన్న 1500 వందలు కూడా ప్రజల చేతికి ఇవ్వాలని అన్నారు , బ్యాంకులో వేస్తె సిటీ కి వెళ్ళడానికి సదుపాయాలు లేవని తెలిపారు .   కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ లోని ప్రతిపక్షం, పలు వ్యాఖ్యలు చేసింది. ప్రజలకు అవసరమైన కూరగాయలు, నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయని.. దీంతో ప్రజలు నిత్యావసరాలు కొనడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారని  కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. అధికారులు అధిక రేట్లు అమ్మే వ్యాపారస్తుల మీద చట్ట పరమైన చర్యలు తీసుకొని, ప్రజలకు నిత్యవసర సరుకులు, కూరగాయలు ప్రభుత్వం నిర్ణయించిన రేటుకే అందుబాటులోకి తీసుకరావాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలను అన్ని విధాలుగా సహాయాన్ని అందజేయాలని కాంగ్రెస్ నాయకులూ తెలిపారు ,. 

Post Top Ad