ఉచిత రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, April 02, 2020

ఉచిత రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి

కొంపల్లి మున్సిపల్ పరిధిలో ప్రభుత్వం తరుపున చేస్తున్న ఉచిత రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి మల్లారెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు లాక్ డౌన్  కారణంగా తెల్లరేషన్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికి 12 కేజీల బియ్యంతో పంపిణి చేయడం జరుగుతుంది. అంతేకాక కుటుంబానికి 1500 ల రూపాయల చొప్పున వారి వారి
బ్యాంక్ అకౌంట్ లలో వేయడం జరుగుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొంపల్లి మున్సిపల్ చైర్మన్ శ్రీశైలం యాదవ్, మాజీ ఎంపీపీ కవిత, తదితరులు పాల్గొన్నారు.

Post Top Ad