న్యూ ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీలో ఇటీవలే కొంతమంది పోలీసులకు కరోనా పాజిటివ్ సోకిన విషయం తెలిసిందే. అయితే తాజాగా హిందూ రావు ఆస్పత్రి లో పనిచేసే నర్సుకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. ఆమెను వెంటనే ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ఈ కేసుతో ఉన్నతాధికారులు తాత్కాలికంగా హిందూ రావు ఆస్పత్రిని మూసివేశారు. ఆస్పత్రిలో ఉన్న రోగుల కోసం ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారులు సదరు నర్సుతో సన్నిహితంగా ఉన్న వారి వివరాలు సేకరిస్తున్నారు. శానిటైజేషన్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఆస్పత్రిని తిరిగి ఓపెన్ చేయనున్నారు.
Post Top Ad
Sunday, April 26, 2020
కరోనా సోకిందని ఆసుపత్రిని మూసివేసిన అధికారులు
Admin Details
Subha Telangana News