ఎస్ఆర్ఎస్పీ కెనాల్ పై సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమీక్ష - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, April 28, 2020

ఎస్ఆర్ఎస్పీ కెనాల్ పై సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమీక్ష

శుభ తెలంగాణ (28, ఏప్రిల్ , 2020) : కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఎస్ఆర్ఎస్పీ, ఐబీ, ఈజిఎస్ అధికారులు, ధర్మపురి మండలం జెడ్పీటీసీ, ఎంపీపీలు, రైతు బంధు సమితి సభ్యులతో నియోజకవర్గంలో ఎస్ఆర్ఎస్పీ కెనాల్ పై సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రిమాట్లాడుతూ... ఎస్ఆర్ఎస్పీకి సంబంధించిన మెన్ కెనాల్, కెనాల్, సబ్ కెనాల్ లోని మట్టి, చెత్తా, రాళ్ళులను వచ్చే మూడు నెలల్లో పూర్తిగా క్లీన్ కావాలని అధికారులను ఆదేశించారు. అధికారులకు నియోజకవర్గంలోని మొత్తం కెనాల్స్ సంఖ్య, కిలోమీటర్ల, పొడవు ఎంత వాటి వివరాలు తెలపవలసిందిగా కోరారు. ఈ క్లీనింగ్ ను రెండు పేస్ లో పూర్తి చేయాలన్నారు. అస్తవ్యస్తంగా ఉన్న కాలువలను మొక్కుబడిగా కాకుండా స్వంత ఊరు పనిగా భావించి పూర్తి చేయాలని ప్రజా ప్రతినిధులు ఆదేశించారు.