అకాల వర్షంతో తడిసిపోయిన ధాన్యం... - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, April 09, 2020

అకాల వర్షంతో తడిసిపోయిన ధాన్యం...

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్(ఎం) మండలం
ఆరుకాలం కష్టపడి రైతు పండించిన పంటను అమ్ముకోవడానికి మార్కెట్ కి తీసుకొస్తే పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఆత్మకూర్(ఎం) సబ్ మార్కెట్ యార్డు కి దాదాపుగా నెల రోజులుగా ధాన్యం వస్తుండగా, యార్డు ధాన్యం రాసులతో
నిండిపోగా, ఎప్పుడు కొనుగోలు ప్రారంభం అవుతుందో అని కళ్ళల్లో వత్తులేసుకొని రైతులు ఎదురుచూస్తున్నారు. అయితే బుధవారం కురిసిన అకాల వర్షంతో ధాన్యం తడిసి ముద్దయ్యింది. వరి ధాన్యం ఎండబోసి పట్టించి, కుప్ప పోస్తే అధికారులు కొనుగోలు చేయక, వచ్చిన అకాల వర్షంతో తడిసిపోయాయి. దయచేసి అధికారులు తొందరగా కొనుగోళ్లు ప్రారంభించాలని, బయటి ప్రాంతాలలో
కొనుగోళ్లు ప్రారంబించినప్పటికి, ఇంకా ఎందుకు
కొనుగోలు ప్రారంభించడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు తొందరగా కొనుగోలు ప్రారంభించాలని అన్నారు.

Post Top Ad