జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు...కరీంనగర్ జిల్లాలో కరోనా కేసులెన్ని...? - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, April 18, 2020

జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు...కరీంనగర్ జిల్లాలో కరోనా కేసులెన్ని...?

శుభ తెలంగాణ (18, ఏప్రిల్ , 2020) : కరీంనగర్ లో ఇప్పటివరకు 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 4 యాక్టివ్ కేసులున్నాయి. 15 మంది డిశ్చార్జి అయ్యారు. తెలంగాణలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 766కు చేరుకుంది. తెలంగాణలో ఇప్పటి వరకు 186 మంది డిశ్చార్జి కాగా, 18 మంది మృతి చెందారు. ప్రస్తుతం 562 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలిలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా - 11, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా - 4, హైదరాబాద్ - 417, జగిత్యాల - 3, జనగాం - 2, జయశంకర్ భూపాలపల్లి జిల్లా -3, జోగులాంబ గద్వాల జిల్లా- 19, కామారెడ్డి జిల్లా - 11, కరీంనగర్ -19, మహబూబాబాద్ జిల్లా - 1, మహబూబ్ నగర్ -11, మెదక్ - 5, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా - 5 ములుగు-2, నాగర్ కర్నూల్ - 2, నల్గొండ- 12, నిర్మల్-17, నిజామాబాద్ - 58,పెద్దపల్లి- 2, రంగారెడ్డి - 23, సంగారెడ్డి - 1 , సిద్దిపేట - 1, రాజన్న సిరిసిల్ల-1, సూర్యాపేట -44, ఖమ్మం - 7, వరంగల్ అర్బన్ -25, వికారాబాద్ - 33 కేసులు నమోదయ్యా యి.