జర్నలిస్టులపై కేసులు ఎత్తి వేయాలని వినతి - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, April 20, 2020

జర్నలిస్టులపై కేసులు ఎత్తి వేయాలని వినతి


శుభ తెలంగాణ (20, ఏప్రిల్ , 2020) ,హైదరాబాద్ ;  కరోనా వార్తలను ప్రసారం చేసిన రెండు న్యూస్ చానెళ్ల ప్రతినిధులపై నేరేడ్ మెట్  పోలీసులు అక్రమంగా నమోదు చేసిన కేసులు ఎత్తి వేయాలని టీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందం డీజీపీ మహేందర్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు. ఈ విషయమై తగు చర్యలు చేపట్టి న్యాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు టీయూడబ్ల్యూజే కార్యదర్శి విరాహత్ అలీ అన్నారు. అలాగే రాష్ట్రంలోని కొన్ని  జిల్లాల్లో జర్నలిస్టులకు విధి నిర్వహణలో పోలీసుల నుంచి ఎదురవుతున్న ఆటంకాలను డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. డీజీపీని కలిసిన వారిలో టీయూడబ్ల్యుజె ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్, హెచ్.యూ.జె కార్యదర్శి శిగ శంకర్  గౌడ్, ఉపాధ్యక్షులు ఆకుల శ్యామ్, హెచ్.యు.జె. ఎలక్ట్రానిక్ మీడియా విభాగం అధ్యక్షుడు బాలు వున్నారు.