ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శానిటైజర్లను పంపిణి - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, April 20, 2020

ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శానిటైజర్లను పంపిణి

శుభ తెలంగాణ (20, ఏప్రిల్ , 2020) , హైదరాబాద్ :  ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మండల పరిషత్ తలకొండపల్లి మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ అమగ్గల్ వారి సౌజన్యంతో ట్రస్ట్ చైర్మన్ తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ మాడుల్ మండలం ఇర్విన్ గ్రామంలో మరియు ఇర్విన్ గ్రామ పంచాయతీ పరిదిలోని దిల్ వార్ ఖన్ పల్లిలో శానిటైజర్లను పంపిణి చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాజమోని పుష్పలత జంగయ్య యాదవ్, ఉప సర్పంచ్ బావాజీ సుజాత శ్రీనివాస్, ఎంపీటీసీ కొప్పుల తిరుపతమ్మ వెంకటయ్య గౌడ్, గ్రామ పంచాయతీ వార్డ్ మెంబెర్స్ ఈసం తుప్పలయ్య గౌడ్, కోప్పుల శివరాజ్ గౌడ్, మాజీ వార్డ్ మెంబెర్ పగడాల ఉమాపతి, గ్రామ  యువకులు, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.