రైతుకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం: కాంగ్రెస్ నాయకులు - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, April 10, 2020

రైతుకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం: కాంగ్రెస్ నాయకులు

తుర్కపల్లి మండలం రుస్తాపూర్ రెవిన్యూ గ్రామ
పంచాయతీలోని పెద్దతండా, సుక్యాతండాలలో నిన్న కురిసిన వడగండ్ల వానతో నష్టపోయిన వరి పంటను పరిశీలించి రైతుకు మనోధైర్యం కల్పించి నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 30000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల బాధను అర్థం చేసుకోని కలెక్టర్, రెవిన్యూ అధికారులు, వ్యవసాయ అధికారులు సర్వే చేసి రైతుకు న్యాయం చేయాలని లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ తరుపున రైతుకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని.. టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి బోరెడ్డి అయోధ్యా రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధనావత్ శంకర్ నాయక్, జిల్లా కాంగ్రెస్ ఎస్టీసెల్ అధ్యక్షులు ధనావత్ భాస్కర్ నాయక్, పెద్దతండా సర్పంచ్ బాబు నాయక్, రుస్తాపూర్ ఎంపీటీసీ మోహన్ బాబు నాయక్
తెలిపారు. ఈ కార్యక్రమంలో రాములు నాయక్, మంగు  నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Post Top Ad