కరోనా ప్రభావితులలో 80% మంది జమాత్ కి సంబంధం ఉన్న వాల్లే : తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, April 21, 2020

కరోనా ప్రభావితులలో 80% మంది జమాత్ కి సంబంధం ఉన్న వాల్లే : తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ

శుభ తెలంగాణ (21, ఏప్రిల్ , 2020 - వరంగల్ ) : ఢిల్లీ నిజాముద్దీన్ లో తబ్లీఘి జమాత్.. దేశంలోని కరోనా లెక్కల స్వరూపాన్నే మార్చేసింది. మర్కజ్ యాత్రికుల వ్యవహారం బయటపడడంతో యావత్ దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. తెలంగాణతో పాటు తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్ లో నమోదైన కేసుల్లో చాలా వరకు మర్కజ్ తో లింక్ ఉంది. అంతేకాదు తెలంగాణలోని కేసుల్లో 80 శాతంపైగా నిజాముద్దీన్ తో సంబంధమున్నట్లు ఇటీవల తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మర్కజ్ కేసులపై తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ స్పందించారు. జమాత్ కు వెళ్లిన వారందరినీ గుర్తించామని.. ఎవరూ మిస్ కాలేదని క్లారిటీ ఇచ్చారు. రంజాన్ దగ్గరపడుతుండడంతో ప్రార్థలను ఇంట్లోనే ఉండి చేసుకోవాలని అందరినీ కోరుతున్నా.. గుంపులుగా గుమికూడితే వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదముంది అని మహ్మద్ అలీ తెలిపారు. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తెలంగాణలో లాక్ డౌనను మే7 వరకు పొడిగిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడా ఎవరికీ మినహాయింపులు ఉండవని.. లాక్ డౌన్ యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.