పేదలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణి చేసిన :టిఆర్ఎస్ నాయకులు నాగునూరి మహేష్....... - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, April 08, 2020

పేదలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణి చేసిన :టిఆర్ఎస్ నాయకులు నాగునూరి మహేష్.......

శుభతెలంగాణ న్యూస్: ఉప్పల్ నియోజకవర్గం  కాప్రా డివిజన్  పరిధిలోని గాంధీనగర్  కాలనీలో TRS కాప్రా  డివిజన్ ఉపాధ్యక్షులు -గాంధీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధక్షులు నగునూరి మహేష్  ఆధ్వర్యంలో  ఏ. ఎస్. రావ్ నగర్ కార్పొరేటర్ శ్రీమతి పావని మణిపాల్ రెడ్డి ముఖ్య అథితులు గా పాల్గొనగా, TRS నాయకులు శ్రీ బద్రుద్దిన్,  ఎరియస్ కమిటీ ఎం.మెంబర్ బిక్షపతి , లోక్ సత్తా నాయకులు శ్రీ బి.శివరామ కృష్ణ పాల్గొని పేదలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణి.
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించిన సందర్భంగా  పని  లేక అల్లాడుతున్న నిరుపేద కుటుంబాల రెక్కాడితే కానీ డొక్కాడని  పరిస్థితి ఉన్న కుటుంబాలను గుర్తించి వారికి ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు నగునూరి మహేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా పస్తులతో ఉండకూడదన్న ముఖ్యమంత్రి కెసిఆర్  గారి సూచనల మేరకుకు కాప్రా డివిజన్ గాంధీనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దాదాపు 300 మందికిి నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీీపంపిణీ చేయడం జరిగిందని.
అంతేేేకాకుండా ప్రజలు అవసరమైతేనే తప్ప బయటికి రాకూడదని ఈ నెల15 తేదీ వరకు  లాక్ డౌన్ పాటించవలసిన  భాద్యత  మన అందరిమీద ఉందని స్వీయ నియంత్రణ పాటించి కరోనా  కట్టడికి కృషిచేయాలని తెలియజేశారు.ఈ కార్యక్రమం లో గాంధీనగర్ మహిళా నాయకులు శ్రీమతి బాలమని, సురేఖ,యాదమ్మ, వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు దామోదర చారి గారు, కుమార్, నర్సింహ, సత్తయ్య, కృష్ణ, ఎన్ శ్రీనివాస్,బాలయ్య,భాస్కర్ , యూత్ అసోసియేషన్ అధ్యక్షులు జి.సత్యనారాయణ,నితీశ్, జి. రాజు,వికాస్, ప్రవీణ్,హరిబాబు,వీరేష్, బాలకృష్ణ, కార్తీక్, చింటు  పాల్గొన్నారు.
మరిన్ని చిత్రాలు :


Post Top Ad