వికారాబాద్ తాజా పరిస్థితు లపై పర్యవేక్షిస్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, April 17, 2020

వికారాబాద్ తాజా పరిస్థితు లపై పర్యవేక్షిస్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి

శుభ తెలంగాణ న్యూస్( 17ఏప్రిల్ 20)వికారాబాద్ జిల్లా గత నెలలో ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ వెళ్లి వచ్చిన ముస్లిం సోదరులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని  పలు వార్డులలో ఆమె పర్యటించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరుణ వ్యాధి నియంత్రణకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలన్నారు కష్టకాలంలో ఉన్న ఇప్పుడైనా కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా గృహ నిర్బంధంలో ఉండి కాలక్షేపం చేయాలని సూచించారు ప్రస్తుతం కరోనా  బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో ప్రజలందరూ గృహ నిర్బంధంలో ఉండి ప్రభుత్వానికి సహకారం అందించాలని ఆమె సూచించారు జిల్లాలో కరోనా వ్యాధిగ్రస్తులు  క్యారం టైం లో  బాధితులు పూర్తిగా నెగటివ్ వచ్చేవరకు పర్యవేక్షిస్తూ ఉండాలని అధికారులను ఆదేశించారు మార్చి 22 నుంచి మే 3 వరకు ఎట్టి పరిస్థితుల్లోనైనా గడప దాటి బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు వికారాబాద్ ప్రాంతంలో పాజిటివ్ సంఖ్య ఎక్కువగా ఉన్నందున నిత్యావసర సరుకు లు సైతం అధికారులచే వారి ఇంటి వద్దకే వెళ్లి ఇవ్వాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలను బయటకు రానివ్వకుండా అధికారులు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు కులమతాలకతీతంగా దేవాలయాలు ముస్లిం ల ప్రార్థనా స్థలాలు చర్చిలు మూసివేయాలి అన్నారు ప్రతి వర్గం వారి సామూహిక ప్రార్థనలకు అనుమతించేది లేదని ఆమె ఆదేశించారు ఎమర్జెన్సీ సర్వీసులు మినహా కట్టుదిట్టం చేయాలని ఆమె ఆదేశించారు ఈ కార్యక్రమంలో వికారాబాద్ కలెక్టర్ పౌర్ణమి బాసు ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ వికారాబాద్ ఎఫ్ బి నారాయణ మున్సిపల్ చైర్మన్ మంజుల రమేష్ మున్సిపల్ కమిషనర్ భోగేశ్వర రావు అదనపు కలెక్టర్ చంద్రయ్య ఆర్ డి ఓ ఉపేందర్ రెడ్డి డిఎస్పి సంజీవరావు వైస్ చైర్మన్ తో పాటు వివిధ వార్డుల్లో కౌన్సిలర్లు జిల్లాస్థాయి అధికారులు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు....