సోలీస్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో శనివారం నిరుపేదలకు, వలస కూలీలకు భోజనం పంపిణీ..... - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, April 18, 2020

సోలీస్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో శనివారం నిరుపేదలకు, వలస కూలీలకు భోజనం పంపిణీ.....

శుభతెలంగాణ న్యూస్(18ఏప్రిల్20)మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం కాప్రా లోని గాంధీనగర్ ప్రాంతంలో సోలీస్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలోశనివారం నిరుపేదలకు, వలస కూలీలకు భోజనం పంపిణీ చేసిన టిఆర్ఎస్ నాయకులు కాప్రా డివిజన్ ఉపాధ్యక్షుడు నాగునూరి మహేష్.
ఈ సందర్భంగా నాగునురి మహేష్  మాట్లాడుతూ..    ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి ఆదేశాల మేరకు మేరకు ఎప్పటికప్పుడు నిరుపేదలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు,బియ్యం ఉచిత పంపిణీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని.అయితే ఈసారి భోజనం పంపిణీ చేశామని.ఉచిత భోజన కార్యక్రమానికి సహకరించిన మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు గారికి మరియు సోలిస్ కంటి ఆస్పత్రి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.కరోనా వైరస్ మహమ్మారి బారిన పడకుండా ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని.ప్రస్తుత పరిస్థితుల్లో లాక్ డౌన్ నే  మనకు శ్రీరామ రక్ష అని.ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి కరోనా మహమ్మారిని అరికట్టేందుకు కృషిచేయాలని  అన్నారు.ఈ కార్యక్రమంలో గాంధీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు
ఎన్.కుమార్,జి.నర్సింహా,ఎన్.శ్రీనివాస్,బాలయ్య     మరియు యూత్ అసోసియేషన్ అధ్యక్షులు  జి.సత్యనారాయణ సెక్రెటరీ  డి.ప్రభాకర్, జి.రాజు   ఎన్.వికాస్,రాకేష్,జి.కృష్ణ,జి.హరిబాబు, శ్రీహరి   పాల్గొన్నారు... 


 మరిన్ని చిత్రాలు: