వరంగల్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో వీడియో చిత్రం విడుదల - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, April 17, 2020

వరంగల్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో వీడియో చిత్రం విడుదల

శుభ తెలంగాణ (17, ఏప్రిల్ , 2020) :  వరంగల్ అర్బన్ జిల్లాలో కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ తో నగరం అందాలతో పాటు ట్రై సిటి ప్రస్తుత స్థితిగతులపై నగరానికి చెందిన యువకులు అరవింద్ ఆర్య , శ్రీకాంత్ , వినయ్ లు రూపొందించిన వీడియో చిత్రాన్ని గురువారం ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ వరంగల్ పోలీస్ కమిషనర్ డా. వి. రవీందర్ తో కలిసి పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిత్రాన్ని రూపొందించిన యువకులను పోలీస్ కమిషనర్ అభినందించడంతో పాటు, కరోనాను తరిమికొట్టేందుకు ప్రజలందరు ఇంటికే పరిమితం కావాలని పోలీస్ కమిషనర్ సూచించగా, కరోనా కట్టడి కోసం కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలందరు ప్రభుత్వ అధికారులు, పోలీసులకు పూర్తి సహకారాన్ని అందిస్తునే ప్రజలందరు ఇంటికే పరిమితం కావాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తెలియజేసారు.