వైఎస్ రెడ్డి ట్రస్ట్ ద్వారా బియ్యం కూరగాయలు పంపిణి : ఎంపిపి ఏనుగు సుదర్శన్ రెడ్డి - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, April 14, 2020

వైఎస్ రెడ్డి ట్రస్ట్ ద్వారా బియ్యం కూరగాయలు పంపిణి : ఎంపిపి ఏనుగు సుదర్శన్ రెడ్డి

శుభ తెలంగాణ(14,ఏప్రిల్,2020) : దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తుంది .  తెలంగాణలో లాక్ డౌన్ వల్ల  మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం మర్పల్లి గూడ గ్రామంలో కరోనా వైరస్ ప్రభావంతో లాక్ డౌన్ అవడం వలన జనాలు ఇంట్లో నుంచి బయటకు రాక ఉపాధి లేక ఇబ్బందులు పడుతూ సోమవారం ఎంపిపి ఏనుగు సుదర్శన్ రెడ్డిని ఆశ్రయించగా వెంటనే స్పందించి ఆ కుటుంబలకు వైఎస్ రెడ్డి ట్రస్ట్ ద్వారా బియ్యం కూరగాయలను అందజేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ నరేష్, వైయస్ రెడ్డి ట్రస్ట్ మండల్ సభ్యులు శివగల్ల భానుచందర్, మహేష్, చందు, హరి, పాల్గొన్నారు.