కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి ... భయంతో వివాహిత..... - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, April 13, 2020

కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి ... భయంతో వివాహిత.....

శుభ తెలంగాణ  (13, ఏప్రిల్,2020 - కూకట్ పల్లి )  : చైనా లో మొదలై , ప్రపంచాన్ని వణికిస్తుంది కరోనా వైరస్ , దీని వ్యాప్తి అరికట్టేందుకు పలు రకాల విషయాలను ప్రభుత్వం వెల్లడించింది . కానీ జనాలలో ఉన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం ఇవ్వటం లేదు .   కరోనా కరెన్సీ నోట్ల ద్వారా వస్తుందా లేదా ? అనే ప్రశ్నకు ఎవ్వరు స్ప్రష్టమైన సమాధానం ఇవ్వటం లేదు . కరోనా వైరస్  ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతోంది. కరోనా అనేక రకాలుగా సోకుతుందని ప్రచారం జరుగుతుండటంతో ఆ మహమ్మారి బారి నుంచి తప్పించుకునేందుకు ప్రజలు తమకు తోచిన విధంగా చేస్తున్నారు. తాజాగా కూకట్ పల్లి ప్రాంతంలోని అల్వీన్ కాలనీలోని ఓ కుటుంబానికి చెందిన వివాహిత కరెన్సీని శానిటైజర్ తో శుభ్రపరిచి అరవేసింది. కరెన్సీ వల్ల తమకు కరోన సోకకుండా ఉండేందుకే ఈ విధంగా చేసినట్లు ఆ కుటుంబీకురాలు తెలిపింది.

Post Top Ad