డిగ్రీ విద్యార్థులకు శుభవార్త : పరీక్షలు రాస్తే చాలు పాస్ అంతే ..! - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, April 24, 2020

డిగ్రీ విద్యార్థులకు శుభవార్త : పరీక్షలు రాస్తే చాలు పాస్ అంతే ..!

శుభ తెలంగాణ (24,ఏప్రిల్,2020 - హైదరాబాద్) : కరోనా కారణంగా కొనసాగుతున్న లాక్ డౌన్ వల్ల అన్ని రకాల ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి .  కామన్ ఎంట్రన్స్ టెస్టల కు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. కరోనా లాక్ డౌన్ ఎప్పటివరకు ఉంటుందో తెలియని పరిస్థితుల్లో మే 7 తర్వాతి పరిస్థితులను బట్టి పరీక్షల తేదీలను ప్రకటిస్తామని చెప్పారు.  ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక వేళ మే నెల మొత్తం లాక్ డౌన్ ఉంటే జూన్ మూడో, నాలుగో వారంలో పరీక్షలు నిర్వహిస్తాం. డిగ్రీ ఆ స్థాయి ఉన్న పరీక్షలు  నిర్వహిస్తాం కానీ, పాస్, ఫెయిల్ అనే మాట ఉండదు. డైరెక్ట్ ప్రమోట్ చేస్తాం. ఇప్పటి వరకు పూర్తయిన సిలబస్ ప్రకారం పరీక్షలు ఉంటాయి. విద్యార్థుల సిలబస్ కోసం కాలేజ్ లతో  మాట్లాడుతున్నాం. ఆన్లైన్ తరగతులు కూడా నిర్వహిస్తాం. కామన్ టెస్ట్ తర్వాత కొత్త విద్యా సంవత్సరం నెల, రెండు నెలలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు.

Post Top Ad