రోజువారి కూలీలకు నిత్యావసర సరుకులు,కూరగాయలు, బియ్యం ఉచితంగా పంపిణీ.... - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, April 19, 2020

రోజువారి కూలీలకు నిత్యావసర సరుకులు,కూరగాయలు, బియ్యం ఉచితంగా పంపిణీ....

శుభ తెలంగాణ(19ఏప్రిల్20) మేడ్చల్ జిల్లా లో శనివారం ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ లోనీ కాప్రా డివిజన్  కార్పొరేటర్ స్వర్ణ రాజ్ శివమణి ఆధ్వర్యంలో  ఉప్పల్ ఎమ్మెల్యే బి.సుభాష్ రెడ్డి చేతుల మీదగా నిరుపేదలు, వలస కార్మికులకు "రెక్కాడితే కాని డొక్కాడని" రోజువారి కూలీలకు నిత్యావసర సరుకులు,కూరగాయలు, బియ్యం ఉచితంగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేదలను అన్ని విధాలుగా ఆదుకుంటుందని. ప్రతి ఒక్కరు ప్రభుత్వ సూచనలను తూచా తప్పకుండా పాటించాలని ఏదైనా సమస్య ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు.
అనంతరం టిఆర్ఎస్ సీనియర్  నాయకులు వంశరాజ్ మల్లేష్ మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో పేదవారి ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పేదవారిని ఆదుకునే బాధ్యత మనందరిపై ఉందని గతంలో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేశామని. ఈ సందర్భంగా గుర్తు చేశారు.ఇక ముందు కూడా చేస్తామని అన్నారు. ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలి అని.అలాగే సామాజిక దూరం పాటించాలని కోరారు.ఈ కార్యక్రమానిలో సుడుగు  మహేందర్ రెడ్డి,వి.పవన్ కుమార్, కొప్పుల కుమార్,మురళి గౌడ్,టీ.నర్సింగ్ రావు, సోలార్ నరసింహ, ఎస్. యాదగిరి,గిల్బర్ట్, సిహెచ్ రాజ్ వంశరాజ్ తదితరులు పాల్గొన్నారు..

మరిన్ని చిత్రాలు: