దేశవ్యాప్తంగా టీవీ యాంకర్లను, రిపోర్టర్లను బెదిరించే వారిపై చర్యలు తప్పవు.. : న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్ - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, April 06, 2020

దేశవ్యాప్తంగా టీవీ యాంకర్లను, రిపోర్టర్లను బెదిరించే వారిపై చర్యలు తప్పవు.. : న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్

దేశవ్యాప్తంగా టీవీ యాంకర్లను, రిపోర్టర్లను బెదిరించే వారిపై చర్యలు తప్పవని న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్ సోమవారం హెచ్చరించింది. దేశవ్యాప్తంగా న్యూస్ ఛానెళ్లలో పనిచేస్తున్న యాంకర్లు, రిపోర్టర్లపై సమాజంలో కొంత మంది బెదిరింపులు, వేధింపులకు దిగుతున్న సందర్భాలు పెరుగుతుండటాన్ని తాము పరిశీలిస్తున్నట్లు న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్ (NBA) తెలిపింది. ఈ మేరకు ఇటీవల ఢిల్లీ తబ్లీఘీ జమాత్ ప్రార్థనల ఘటన వల్ల కరోనా వైరస్ దేశంలో ఎక్కువగా ప్రబలుతోందనీ, ఎక్కువ కేసులు, ఎక్కువ మరణాలూ సంభవిస్తున్నాయని ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు వచ్చిన తర్వాత ఈ బెదిరింపుల వ్యవహారం వెలుగులోకి వచ్చిందని (న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్) తెలిపింది. సోషల్ మీడియాలో వాట్సాప్, టిక్ టాక్, ట్విట్టర్ వంటి వాటిలో యాంకర్లు, రిపోర్టర్లను ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నారని వివరించింది.

ఈ సందర్భంగా సోషల్ మీడియాలోని కొన్ని వీడియోల్లో మత ప్రబోధకులు.. కొన్ని టీవీ ఛానెళ్ల యాంకర్ల పేర్లను ప్రస్తావిస్తూ.. వారిపై, వారు పనిచేస్తున్న ఛానెళ్లలో రిపోర్టర్లపై దాడులు చేస్తామని బెదిరిస్తున్నారని తెలిపింది. ఇలాంటి చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్న న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్.. వీటికి పాల్పడుతూ.. సమాజ వ్యతిరేక శక్తులుగా మారిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని.. కేంద్ర ప్రభుత్వం, న్యాయ వర్గాలను కోరింది. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ మీడియా.. ఈ లాక్‌డౌన్ సమయంలో... దేశంలో కరోనా వైరస్‌పై అత్యంత ఎక్కువగా కష్టపడుతూ.. సమాచారం ప్రజలకు చేరవేస్తోందనీ.. వార్తల్ని చాలా వాస్తవంగా, కచ్చితత్వంతో, బ్యాలెన్స్‌డ్‌గా ఇస్తోందని న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అభిప్రాయపడింది. కరోనా వైరస్‌పై అన్ని వర్గాల వారి అభిప్రాయాల్నీ టీవీ చర్చల్లో స్వీకరిస్తోందని తెలిపింది. 

ఈ నేపథ్యంలో మత పెద్దలు ఇలాంటి బెదిరింపు చర్యల్ని ఖండించాలని కోరింది. అలాంటి చర్యలు రాజ్యాంగంలోని ప్రాధమిక హక్కుల్లో భాగమైన భావ ప్రకటనా స్వేచ్ఛకు వ్యతిరేకం అని వివరించింది. మత పెద్దలకు కూడా న్యూస్ ఛానెల్స్ అందుబాటులోనే ఉన్నాయన్న న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్.. ఆ మతాల పెద్దలు ముందుకు వచ్చి.. తబ్లిఘీ జమాత్ ఘటన వల్ల కరోనా వైరస్ ప్రబలుతున్న అంశంపై తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేయవచ్చని తెలిపింది.

Post Top Ad