మలక్‌పేట కంటైన్‌మంట్‌ జోన్‌గా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, April 30, 2020

మలక్‌పేట కంటైన్‌మంట్‌ జోన్‌గా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం


శుభ తెలంగాణ  (మలక్‌పేట) : తెలంగాణ లోని మలక్‌పేట మహబూబ్‌ మాన్షన్‌ మార్కెట్‌ను కంటైన్‌మంట్‌ జోన్‌గా ప్రకటించినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు వెల్లడించారు. ఇటీవల మార్కెట్‌లో చక్కెర వ్యాపారం చేస్తున్న ఇద్దరు సోదరులు, మరో నూనె వ్యాపారికి కరోనా సోకడంతో ముందు జాగ్రత్త చర్యగా మార్కెట్‌ను పూర్తిగా బంద్‌ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మార్కెట్‌లో వారం రోజుల పాటు ఎలాంటి కార్యకలాపాలు జరగబోవని మార్కెట్ ఉన్నత శ్రేణి అధికారి దామోదర్‌, ఛైర్ పర్సన్‌ రాధ స్పష్టం చేశారు. మార్కెట్‌ను పూర్తిగా శానిటైజర్‌తో శుద్ధి చేయనున్నట్లు చెప్పారు. మార్కెట్‌లోని ప్రధాన గేట్లు మూసివేసి ఎవరినీ లోనికి అనుమతించకుండా దుకాణాలను పూర్తిగా మూసివేస్తున్నట్లు వివరించారు. మార్కెట్‌కు వచ్చే ప్రధాన ఉత్పత్తులు మిర్చి, చింతపండు, ఉల్లితో పాటు హోల్‌సేల్‌, రిటైల్‌ దుకాణాల్లో ఎలాంటి వ్యాపారాలు కొనసాగవని వెల్లడించారు.

Post Top Ad