ప్రజలను లాఠీలతో కొట్టిన కానిస్టేబుల్, హోంగార్డ్ : ఆగ్రహం వ్యక్తం చేసిన హైదరాబాద్ సీపీ - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, April 30, 2020

ప్రజలను లాఠీలతో కొట్టిన కానిస్టేబుల్, హోంగార్డ్ : ఆగ్రహం వ్యక్తం చేసిన హైదరాబాద్ సీపీ


శుభ తెలంగాణ  (హైదరాబాద్‌) :  కరోనా లాక్ డౌన్ నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ కొందరు వ్యక్తులు అనవసరంగా రోడ్లపైకి వాస్తు..లాక్ డౌన్ నిబంధనలను పాటించడంలేదు. తాజాగా హైదరాబాద్ మీర్ చౌక్ పీఎస్ పరిధిలో కొందరు వ్యక్తులను ఓ కానిస్టేబుల్, గోల్కొండ పరిధిలో ఓ హోంగార్డు లాఠీలతో కొట్టారు. దీంతో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అసహనం వ్యక్తం చేశారు. ఒకరిద్దరు కింద స్థాయి పోలీసు సిబ్బంది వల్ల డిపార్ట్ మెంట్ కు చెడ్డ పేరు వస్తోందని అన్నారు. వీరికి ఏసీపీలు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు తగిన సూచనలు ఇవ్వాలని చెప్పారు. ప్రతి డీసీపీ ప్రతి రోజు తన జోన్ లో ఉన్న రెండు పోలీస్ స్టేషన్లను సందర్శించాలని అన్నారు. రంజాన్ ఉపవాసాలను పాటిస్తున్న వారి పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు.