పరిశ్రమలశాఖ ఉన్నతాధికారులతో మంత్రి కేటీఆర్‌ సమీక్ష : లక్డౌన్ పై ప్రత్యేక చర్చ - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, April 30, 2020

పరిశ్రమలశాఖ ఉన్నతాధికారులతో మంత్రి కేటీఆర్‌ సమీక్ష : లక్డౌన్ పై ప్రత్యేక చర్చ

శుభ తెలంగాణ  (హైదరాబాద్‌) : కరోనా కట్టడి కోసం ఏర్పాటు చేసిన లక్డౌన్ గడువు దగ్గరికి వస్తున్నా వేల పరిశ్రమలశాఖ ఉన్నతాధికారులతో మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. కరోనా సంక్షోభం తర్వాత తీసుకోవాల్సిన చర్యలపైన ప్రధాన చర్చించారు. సంక్షోభం తర్వాత యధావిధిగా పారిశ్రామికరంగ కార్యకలాపాలు కొనసాగేలా.. చర్యలు తీసుకోవాలని పరిశ్రమలశాఖ అధికారులకు కేటీఆర్‌ ఆదేశించారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు తమ పెట్టుబడులను.. నూతన ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పారు. వీటిని అందుకునేందుకు తెలంగాణ సిద్దంగా ఉండాలని చెప్పారు. పెట్టుబడి అవకాశాలున్న రంగాల్లో మరింత చురుగ్గా పనిచేయాలని కేటీఆర్‌ ఆదేశించారు.