లాక్ డౌన్ పై మరో మూడు రోజుల్లో ప్రధానిమోడీ ప్రకటన - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, April 29, 2020

లాక్ డౌన్ పై మరో మూడు రోజుల్లో ప్రధానిమోడీ ప్రకటన

కరోనా వైరస్ ప్రభావంతో దేశ వ్యాప్తంగా మే 3 వరకు
కేంద్రం లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్
డౌన్ పొడిగించాలా లేదా అనే దాని పై ఇప్పటికే సీఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అభిప్రాయం తీసుకున్నారు. లాక్ డౌన్ పై మరో మూడు రోజుల్లో ప్రధాని  మోడీ ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. అయితే లాక్ డౌన్
పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే...

"లాక్ డౌన్ వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు
ఎదుర్కొంటున్నారు.  కానీ ప్రజలను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది. అందుకే లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాం. మే 3 తర్వాత కూడా లాక్ డౌన్ కొనసాగింపుకు కేంద్రం మొగ్గు చూపుతుంది. కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ కొనసాగింపునకు, కొన్ని సడలింపులకు
మొగ్గుచూపుతున్నాయి. కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తాం. గ్రీన్ జోన్లలో మినహాయింపునిచ్చే అవకాశం ఉంది. ప్రజా రవాణా, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, బార్లు, రెస్టారెంట్లపై ఆంక్షలు కొనసాగుతాయి. లాక్ డౌన్ ఎన్ని రోజులు
కొనసాగిస్తామనే దాని పై ప్రధాని ప్రకటన చేస్తారు." అని మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.